నిన్న మ‌హేష్‌కు.. ఈ రోజు బ‌న్నీకి.. జగ‌న్ గిఫ్ట్ అదిరిందిగా..

-

హీరో మహేష్ బాబు అభిమానులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అదిరిపోయే గిఫ్ట్ అందించిన సంగ‌తి తెలిసిందే. నిన్న‌ సంక్రాంతి కానుకగా..మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో జనవరి 11 నుంచి 17 వరకు రెండు షోలు అదనంగా వేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. అయితే ఈ రోజు బ‌న్నీ అభిమానుల‌కు కూడా అదిరిపోయే గిఫ్ట్ అందించారు. సంక్రాంతి సినిమాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా వాటికి పెట్టిన బడ్జెట్.. ఉన్న క్రేజ్ కారణంగా తమ సినిమాలకు ఆరు షోలు వేసుకోడానికి అనుమతి కావాలంటూ ప్రభుత్వాన్ని అనుమతి కోరారు నిర్మాతలు.

ఇప్పటికే సరిలేరు నీకెవ్వరుకు ఇది ఇచ్చేసింది జగన్ ప్రభుత్వం. ఇప్పుడు అల వైకుంఠపురములో సినిమాకు కూడా ఇదే చేసింది. ఈ సినిమాకు కూడా ఏపీలో ఆరు షోలకు పర్మిషన్ ఇచ్చేసారు. అర్ధరాత్రి 1 నుంచి 10 గంటల మధ్యలో ఆరు షోలు ప్రదర్శించుకోవచ్చు అంటూ అనుమతి ఇచ్చింది గవర్నమెంట్. దాంతో పండగ చేసుకుంటున్నారు బయ్యర్లు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈ వారం రోజులు కలెక్షన్ల కుంభవృష్టి కురవడం ఖాయం. అదే ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు కూడా. దాదాపు 1000 స్క్రీన్స్‌లో అల వైకుంఠపురములో విడుదల కానుంది ఈ చిత్రం.

Read more RELATED
Recommended to you

Exit mobile version