ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సిఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటన లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. 11 గంటలకు తణుకు చేరుకోనున్నారు.
అక్కడి నుంచి నేరుగా తణుకు జడ్పీ బాలుర హైస్కూల్‌లో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు సీఎం జగన్. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ప్రారంభించి అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు ముఖ్యమంత్రి జగన్. ఇక ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు తణుకు నుంచి తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం జగన్.
ఇక ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన పుట్టిన రోజు వేడుకలను అభిమానులు, వైసీపీ నేతలు చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం తర్వాత సీఎం జగన్ తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు సమాచారం అందుతోంది.