చైనా ప్రస్తుతం తీవ్ర విద్యుత్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. బొగ్గు కొరత కారణంగా సంక్షోభం తలెత్తింది. ఇప్పుడు ఆ దేశం కరెంట్ కోతలతో సతమతమవుతోంది. తాజాగా ఇటువంటి పరిస్థితే భారత్ కు తప్పదా అనే సందేహాలు వస్తున్నాయి. దేశంలో కూడా బొగ్గు కొరత ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజా విద్యుత్, బొగ్గు నిల్వల కొరతపై ఏపీ ముఖ్యమంత్రి ప్రధాని మోడీకి లేఖ రాశారు. కరోనా తర్వాత దేశంలో ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవడం, పరిశ్రమలు నడుస్తుండటంతో విద్యుత్ డిమాండ్ పెరిగింది.
చైనా విద్యుత్ సంక్షోభం ఇండియాకు కూడా తప్పదా..!
-