తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రముఖ ప్రయివేట్ కంపెనీ పరిశ్రమ నిర్మించడానికి ముందుకు వచ్చింది. హిందిస్తాన్ కోకాకోలా బేవరేజెస్ కంపెనీ తెలంగాణలో మరో సారి భారీ గా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అయింది. అందు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కీలక ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కోకాకోలా కంపెనీ ఒప్పంద పత్రాలను మార్చుకున్నాయి.
ఇప్పటికే కోకాకోలా కంపెనీ సంగారెడ్డి తో పాటు అమీన్ పూర్ లలో పరిశ్రమలు ఉన్నాయి. తాజా ఒప్పందంతో సిద్దిపేట్ జిల్లాలోని తిమ్మపూర్ లో మరో పరిశ్రమను ఏర్పాటు చేయబోతుంది. దీని కోసం కోకా కోలా కంపెనీ రూ. 600 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు రాబోతున్నాయి.
కాగ కోకాకోలా కంపెనీ కోసం సిద్ధిపేట్ లో రాష్ట్ర ప్రభుత్వం 48.53 ఎకరాల భూమిని కేటాయించింది. సిద్ధిపేట్ లో ఏర్పాఉట కాబోతున్న కోకాకోలా కంపెనీలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పిస్తామని కోకాకోలా కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అంతే కాకుండా… ఎక్కువ శాతం మహిళలకే ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు.