ఏపీలో నేడు సాయంత్రంతో కోడిపందాలు ముగియనున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా జోరుగా సాగాయి పందాలు. గోదావరి జిల్లాల్లో 250 బరుల్లో జరుగుతున్నాయి కోడిపందాలు. పందాల్లో 100 కోట్లు పైబడి చేతులు మారింది డబ్బు. ఆఖరి రోజు మరింత జోరుగా సాగనున్నాయి కోడిపందాలు. ఐదు లక్షల రూపాయలు దాటి నిర్వహించే కోడిపందాలకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు.
ఏపీలోని చాలా జిల్లాల్లో 3వ రోజు కోడిపందాల జోరు కొనసాగుతోంది. ఉదయం నుంచి బరుల వద్దకు పందెం రాయుళ్లు చేరుకోగా…. రూ. లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని భీమవరం, ఉండి, ఆకివీడు, వీరవాసరం, జంగారెడ్డిగూడెం, లింగపాలెం, దెందులూరు, నందిగామ, తిరువూరు, జి. కొండూరు, గుడివాడ సహా చాలా చోట్ల పందేలు చూసేందుకు జనాలు తరలివస్తున్నారు. నేటితో కోడి పందేలు ముగియనున్నాయి.