హైదరాబాద్ వాసులకు కేసీఆర్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ బన్సీలాల్ పేట డివిజన్ బండ మైసమ్మ నగర్ లో నిర్మించిన 310 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను ప్రారంభించారు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్. దీంతో 310 కుటుంబాలకు లబ్ది చేకూరింది. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. జిహెచ్ఎంసిలో 23 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీలు పూర్తి అయ్యాయి.
అందులో ఏడు కాలనీలు సనత్ నగర్ నియోజకవర్గంలో పూర్తి అయ్యాయన్నారు. నగరంలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేయాలని కేటీఆర్ భావించారని తెలిపారు… 60 వేల ఇండ్లు పూర్తి దశకు వచ్చాయి… 40 వేల ఇండ్లు త్వరలో పూర్తి అవుతాయన్నారు.
కేసీఆర్ పేదలు ఆత్మ గౌరవంతో ఉండేలా ఇండ్లు నిర్మించాలని కలలు కన్నారని.. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం కేసీఆర్ చేశారని వెల్లడించారు. కేసీఆర్ కలలను సనత్ నగర్ నియోజకవర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ సాకారం చేస్తున్నారని.. డబ్బులు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకుంటామంటే నష్ట పోతారు. చాలా పారదర్శకంగా ఇల్లు లబ్ధిదారులకు అందజేస్తామని స్పష్టం చేశారు.