వైసీపీ నేత‌పై జ‌గ‌న్‌కు కంప్లైంట్ చేసిన బ‌డా నిర్మాత‌

-

సినిమా నిర్మాత‌పై మ‌రో సినిమా నిర్మాత ఇప్పుడు కేసులు పెట్టుకోవ‌డం… ఆ కేసులుకు మూలం సీఎం జ‌గ‌న్ స‌పోర్టే అని మరో నిర్మాత ఏకంగా సీఎం జ‌గ‌న్‌కు పిర్యాదు చేయ‌డం ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపీక్ అయింది. ఇంత‌కు ఏ నిర్మాత ఏ నిర్మాత‌పై కేసు పెట్టారు.. ఏ నిర్మాత జ‌గ‌న్ పేరు చెప్పుకుని బ‌తుకుతున్నాడు.. ఏ నిర్మాత సీఎం జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేశారు.. ఇంత‌కు విష‌యం ఏంటి అని ఆరా తీస్తే సినిమా ప‌రిశ్ర‌మ నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఈ ఇద్ద‌రు నిర్మాత‌లు అప్పుల గొడ‌వ‌కు రాజ‌కీయ రంగు పులిమారు.. చివ‌రాఖ‌రికి దాన్ని ఏపీ సీఎం జ‌గ‌న్ వ‌ర‌కు తీసుకుపోయారు.

ఇంత‌కు అస‌లు విష‌యం చెప్ప‌లేదు క‌దూ.. ఇద్ద‌రు నిర్మాత‌లు ఎవ్వ‌రంటే.. ఒక‌రు ప్ర‌ముఖ నిర్మాత‌, పారిశ్రామిక వేత్త పివీపీ కాగా, మ‌రొక నిర్మాత బండ్ల గ‌ణేష్‌.. వాస్త‌వానికి ఈ ఇద్ద‌రు రాజ‌కీయాల క‌న్నా ముందే సిని ప‌రిశ్ర‌మ‌లో బడా నిర్మాత‌లు. ఒక‌రు అగ్ర నిర్మాత‌గా, బ‌డా పారిశ్రామిక‌వేత్త‌గా ఉన్నారు. ఆయ‌నే పివీపీ. ఇక ఒక‌రు సినిమాల్లో క‌మెడియ‌న్‌గా అరంగ్రేటం చేసి ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌పోర్టుతో బడా నిర్మాత‌గా మారిన బండ్ల గ‌ణేష్‌. అయితే బండ్ల గ‌ణేష్ సినిమా నిర్మాత‌గా క్లిక్ కాగానే రాజ‌కీయాల బాట ప‌ట్టారు. కాంగ్రెస్‌లో చేరి తిరిగి మ‌ళ్ళీ సినిమా బాటే ప‌ట్టాడు.. నిర్మాత నుంచి తిరిగి క‌మేడియ‌న్‌గా మారిన బండ్ల గ‌ణేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలో న‌టిస్తున్నాడు.

ఇక పివీపీ పారిశ్రామిక వేత్త నుంచి నిర్మాతగా మారి, ఆపై మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఏపీలో విజ‌య‌వాడ ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ ప్ర‌భంజనంలోనూ పివీపీ ఓడిపోవ‌డానికి ఆయ‌న స్వ‌యంకృప‌రాధ‌మే కార‌ణ‌మ‌నే భావన ప్ర‌జ‌ల్లో ఉంది. అయితే ఇద్ద‌రు సినిరంగం నుంచి, రాజ‌కీయ రంగంకు వ‌చ్చిన ఇద్ద‌రు అట్ట‌ర్ ప్లాప్ అయ్యారు. అయితే పీవీపీ ద‌గ్గ‌ర బండ్ల గ‌ణేష్ టెంప‌ర్ సినిమా నిర్మాణ సమ‌యంలో కొంత మొత్తం ఫైనాన్స్ తీసుకున్నాడ‌ట‌. అయితే సినిమా విడుద‌ల‌కు ముందే కొంత మొత్తాన్ని చెల్లించి, మిగ‌తా మొత్తానికి చెక్కులు ఇవ్వ‌గా అవి డ‌బ్బులు డ్రా కాలేద‌ట‌. దీంతో పీవీపీ ఇటీవ‌ల బండ్ల గ‌ణేష్‌కు ఫోన్ చేసి డ‌బ్బులు అడిగాడ‌ట‌.

దీంతో బండ్ల గ‌ణేష్ ఇంటిమీదికి వ‌చ్చి దాడి చేసాడ‌ని పివీపీ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేష‌న్‌లో పిర్యాదు చేయ‌డం, దీంతో బండ్ల గ‌ణేష్‌, ఆయ‌న న‌లుగురు అనుచ‌రుల‌పై కేసు న‌మోదు చేయ‌డం జ‌రిగింది. అయితే బండ్ల గ‌ణేష్ పీవీపీపై ఇప్పుడు ఏకంగా ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ట్విట్ట‌ర్ ద్వారా పిర్యాదు చేయ‌డం విశేషం. పివీపీ మీ పేరు పార్టీపేరు చెప్ప‌కుంటూ అంద‌రిని బెదిరిస్తున్నారంటూ పిర్యాదు చేశారు. ఇప్పుడు సిని పెద్దల వ్య‌వ‌హారం రాజ‌కీయ రంగు పులుముకుంది.. మ‌రి బండ్ల గ‌ణేష్ పిర్యాదుపై సీఎం జ‌గ‌న్ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version