హైదరాబాద్: మాజీ మంత్రి నారాయణ కిడ్నాప్ గురయ్యారని రాయదుర్గం పీఎస్ లో ఫిర్యాదు అందింది. నారాయణ వ్యక్తిగత సహాయకులు రాయదుర్గం పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలెర్ట్ చేశారు రాయదుర్గం పోలీసులు. షాద్ నగర్ కొత్తూరు సమీపం లో ఏపీ పోలీసుల వాహనాలను కొత్తూరు పోలీసులు ఆపేసారు.
తాము పదోతరగతి ప్రశ్న పత్రాలు లీకేజ్ వ్యవహారంలో అదుపులోకి తీసుకున్నట్టు చెప్పిన ఏపీ పోలీసులు. దీంతో కొత్తూరు నుండి చిత్తూరుకి తరలించారు ఏపీ పోలీసులు. కాగా మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ పై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి నారాయణ అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జగన్ రెడ్డి తన అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ అక్రమ అరెస్ట్ లు అని.. మూడేళ్ల పాలనలో కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇచ్చి.. టీడీపీ నేతలను అక్రమ అరెస్ట్ లు, అక్రమ నిర్బంధాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.