హైదరాబాద్ లో మాస్క్ ఉంటేనే సరుకులు…!

-

కరోనా కట్టడి కావాలి అంటే మాస్క్ ల అవసరం చాలా ఉంది. మాస్క్ ని అందరూ ధరించాలి అని ప్రధాని నుంచి ప్రతీ ఒక్కరు కూడా ప్రజలకు సూచిస్తున్నారు. కొంత మంది మాస్క్ లేకుండా బయటకు వస్తున్నారు. వాళ్లకు ఫైన్ లు కూడా విధిస్తున్న సంగతి తెలిసిందే. చాలా మందిలో మార్పు మాత్రం రావడం లేదు. దీనితో ఇప్పుడు కొందరు కఠిన నిర్ణయాలు తీసుకుని అయినా ప్రజలకు మాస్క్ ల అవసరం ఎంతో చెప్తున్నారు.

కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్క్ ల అవసరం ఎక్కువ. దీనితో ఇప్పుడు మాస్క్ లు లేకపోతే పెట్రోల్ పోయడం లేదు కొందరు. హైదరాబాద్ లో ఈ నిర్ణయం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా సరుకులు ఇవ్వాలి అంటే మాస్క్ ఉండాల్సిందే అని స్పష్టం చేసారు కొందరు వ్యాపారులు. మాస్క్‌లు ధరించాలి అని ప్రభుత్వం చెప్పడంతో… వ్యాపారులు కఠినం గా అమలు చెయ్యాలని భావిస్తున్నారు.

ముషీరాబాద్‌, అంబర్‌పేట నియోజకవర్గాలలోని పలు కిరాణా షాపుల యజమానులు, దుకాణాలకు మాస్కులు ధరించి వస్తేనే కిరాణా సామగ్రి ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. భౌతిక దూరం లేకపోతే మాత్రం సరుకులు ఇచ్చేది లేదని అంటున్నారు. ఇక మెడికల్ షాపుల యజమానులు కూడా ఇప్పుడు ఇదే నిబంధన విధిస్తున్నారు. మాస్క్ ఉంటేనే మందులు ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version