శానిటైజర్ నుంచి మద్యం తయారి…!

-

మద్యం కోసం జనాలకు ఇప్పుడు పిచ్చి ఎక్కే పరిస్థితి వచ్చింది అనేది వాస్తవం. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కఠినం గా అమలు చేస్తున్నారు. ప్రతీ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు ఉన్న నేపధ్యంలో ఇప్పుడు కట్టడి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వాలు… మద్యం షాపులను ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా సరే ఆపేస్తున్నారు. దీనితో మద్యపానానికి అలవాటు పడిన వాళ్లకు పిచ్చి ఎక్కుతుంది.

మద్యం కోసం కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదోక విధంగా ఇంట్లోనే తయారు చేసుకోవడానికి చూస్తున్నారు. ఈ నేపధ్యంలోనే మధ్యప్రదేశ్ లో శానిటైజర్ నుంచి మద్యం తయారు చేయడం మొదలుపెట్టారు. ఇక మద్యం వ్యాపారులు అందరూ కూడా అక్రమ మద్యం తయారు చేయడానికి చూస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాకు చెందిన ఇందల్ సింగ్ రాజపుత్ ఏకంగా శానిటైజర్ నుంచి మద్యం తయారు చేయడానికి ట్రై చేసాడు.

శానిటైజర్‌లో అధిక శాతం(72 శాతం) ఆల్కహాల్ ఉండటంతో అతడు మద్యం తయారు చేయడానికి చూసాడు. దీని గురించి పోలీసులకు ఒకరు సమాచారం ఇవ్వడంతో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శానిటైజర్ ఆ రాష్ట్రంలో ఎంత కావాలి అంటే అంత దొరుకుతుంది. శానిటైజర్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో డిస్టిలరీలు మద్యం నుంచి శానిటైజర్ తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version