తెలుగు సినిమా షూటింగ్స్ బంద్‌పై గందరగోళం సాగుతోంది. ఫిల్మ్ చాంబర్ నిర్ణయానికి వ్యతిరేకంగా పలువురు నిర్మాతలు షూటింగ్స్ కొనసాగిస్తున్నారు. వాటిలో స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. వంశీపైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ‘వారసుడు’, సితార ఎంటర్టైన్మెంట్స్లో ధనుష్ ‘సార్’ షూటింగ్ జరుగుతున్నాయి. సినిమా చిత్రీకరణల బంద్‌పై ఫిల్మ్ ఫెడరేషన్‌కు లేఖ అందలేదని తెలిసింది. ఈ క్రమంలోనే బంద్‌పై స్పష్టత లేకపోవడంతో సినిమా షూటింగ్స్ కార్మికులు వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో సినిమా షూటింగ్స్ బంద్‌పై ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడితో ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు.