అవిభక్త కవలలకు వీణా వాణీలకు జేజేలు. ఇంటర్ ఫలితాల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన ఈ చిన్నారులకు జేజేలు. ఈ విజయం ఎందరికో స్ఫూర్తి. తమకు మార్కులు రాలేదని, తమకు మంచి కాలేజీ లేదని, ఇంకా ఏవేవో సాకులతో కాలం వెళ్లదీసేవారికి ఇదొక పాఠం కూడా ! కనుక ప్రతి విజయాన్నీ ఆస్వాదించడం మొదలు పెట్టాక కష్టాలు, కన్నీళ్లు దాటుకుని చేసే ప్రయాణం కొందరికి ప్రేరణ. వీణావాణీలకు ఎన్నో సవాళ్లు. శరీర పరంగా ఉన్నాయి. కానీ వారి సంకల్పానికి ఇవేవీ తెలియవు. ఈ బిడ్డలు బంగరు భవిష్యత్ ను పొందాలని దేవుడ్ని ఈ ఉదయం వేడుకుందాం.
పరీక్ష తప్పితే చాలు జీవితం ముగిసిపోయింది అని అనుకోవడం.. లేదా జీవితం చాలించాలని అనుకోవడం…ఆత్మ హత్యల పేరిట కన్నవారికి గర్భశోకం మిగల్చడం ఎంత తప్పు. వీటిని దాటుకుని జీవించాలి. వీటిని దాటుకుని మంచి ఫలితాలు అందుకోవాలి. కష్ట , సుఖాల్లోనూ స్థిత ప్రజ్ఞత కలిగి ఉండాలి అని చాటి చెప్పిన వీణావాణీలకు మరో సారి అభినందనలు. పరీక్ష తప్పినంత మాత్రాన ఆగిపోవడం తప్పు.. కొత్తగా ప్రయాణించాలి.. కొత్త ప్రయత్నాలేవో చేయాలి. కొన్నేళ్లుగా శారీరక వైకల్యం ను దాటుకుని ప్రయాణిస్తున్న ఈ బిడ్డల దగ్గర మనం అంతా ఎంతని . చాలా చిన్నవారం.. మనం ఇంకొన్ని విజయాలు అందుకోవాలి అంటే ఇలాంటి బిడ్డలకు కాస్త సాయం అందిస్తే చాలు.. కొంత ఆనందం మన జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది. కాస్తభరోసా ఇవ్వండి ఇలాంటి వారికి మీ జీవితం మరికొంత కొత్త ఉత్సాహాలను అందుకుంటుంది. కనుక బిడ్డలంతా బాధ్యతగా ఉండాలి.