ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కాంగ్రెస్‌ అధిష్టానం సీరియస్‌

-

సంగారెడ్డి ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి పై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా సీరియస్ అయింది. తెలంగాణ రాష్ట్ర పిసిసి చీప్ రేవంత్ రెడ్డి ను ఉద్దేశించి జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యల పై ఆరా తీశారు రాష్ట్ర పార్టి వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్. ఇందులో భాగంగానే…. ఇవాళ సాయంత్రం గాంధీ భవన్ లో జరుగనున్న పొలిటికల్ ఎపైర్స్ కమిటి సమావేశంలో సీరియస్ గా చర్చించాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు చెప్పారు మాణిక్యం ఠాకూర్.

jaggareddy | జగ్గారెడ్డి

ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు తో వివరాలు తెప్పించారు మాణిక్యం ఠాగూర్. ఇక ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ కు రానున్నారు మాణిక్యం ఠాగూర్. ఈ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అంతకు ముందు రేవంత్‌ పై మండిపడ్డారు జగ్గారెడ్డి. రేవంత్ ఒక్కడితో అంతా అయిపోదని.. అందరినీ కలుపుకుని పోవాలని ఫైర్‌ అయ్యారు జగ్గారెడ్డి. రేవంత్ తీరుపై సోనియా, రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తానని.. నేను మాట్లాడేది తప్పు అయితే…రేవంత్ చేసేది కూడా తప్పేనని తెలిపారు. రేవంత్ లేనప్పుడు పార్టీ అధికారం లోకి రాలేదా ..? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version