రాష్ట్రంలోని ప్రతీ మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.10వేలు బాకీ : హరీశ్ రావు

-

కాంగ్రెస్ ప్రభుత్వం పై  మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. బుధవారం భువనగిరి లోక్ సభ నియోజకరవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.. మరీ మహిళలకు ఎవరికైనా రూ.2500 నగదు వచ్చిందా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావడంతో రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం రూ.10 వేలు బాకీ పడిందన్నారు. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలను కాంగ్రెస్ మోసం చేసిందని ఫైర్ అయ్యారు. అధికారంలోకి వస్తే క్వింటాకు రూ.500 ఇచ్చి పంట కొంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.. కాబట్టి క్వింటాకు రూ.2500 ఇచ్చి వడ్లు కొంటేనే కాంగ్రెస్ ఓట్లు అడగాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version