తెలంగాణ భవన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

-

పాలన పరంగా కీలక నిర్ణయాలను చాలా వేగంగా తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ భవన్ పై కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ప్రస్తుతం ఉన్న పటౌడీ హౌస్ లో తెలంగాణ భవన్ నిర్మించాలని నిర్ణయించింది. కొత్త భవన్ ను పటౌడీ హౌస్ ఉన్న ఐదున్నర ఎకరాలతో నిర్మించాలని భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి బిల్డింగ్ కు సంబంధించిన సమాచారాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పటౌడీ హౌస్ లో ఉన్న స్థలం ఎంత..? మొత్తం ఎన్ని గదులు ఉన్నాయి వంటి అంశాలపై ఆరా తీసినట్టు తెలిసింది.

ఆర్అండ్ బీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇదే అంశంపై స్పందించారు. తెలంగాణ భవన్ నిర్మాణం పై మార్చి లోపు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ భవన్ నిర్మాణం పై ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి ఫోకస్ చేశారు. మల్లు రవి మాట్లాడుతూ.. తెలంగాణ భవన్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పంపామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నిర్మాణ పనులను ప్రారంభం కానున్నట్టు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version