జగన్ కోసం అండగా మేం ఉన్నాం..విజయమ్మ వస్తుంది – వైఎస్ విమలా రెడ్డి

-

ఎన్నికల వేళ ముఖ్యమంత్రి జగన్ కుటుంబంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా మేనల్లుడు జగన్ కు బాసటగా నిలిచారు  మేనత్త వైఎస్ విమలా రెడ్డి.రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వర్గాలను సమీకరించే విధంగా కసరత్తు చేస్తున్నారు. విజయవాడలో పాస్టర్లతో సమావేశాన్ని చేపట్టింది వైఎస్ విమలమ్మ. దాదాపు 26 జిల్లాల నుంచి పలువురు ఫాస్టర్లు హాజరయ్యారు.

సీఎం జగన్ మేనత్త వైఎస్ విమలమ్మ మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం పేదలు అందరికీ మేలు చేస్తుంది అని తెలిపారు. ఇవన్నీ ఇలాగే కొనసాగాలి అంటే ఈ ప్రభుత్వమే మళ్ళీ రావాలి అని కోరారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా జగన్ ఉన్నారు అని భరోసా ఇవ్వటం కూడా దీనిలో భాగమేనని తెలిపారు. ప్రధానంగా పాస్టర్ల ప్రార్ధనలు, సహకారం మాకు చాలా అవసరం అని తెలిపారు. జగన్ వెంట ఉండటం కుటుంబ సభ్యురాలిగా నా బాధ్యత అన్నారు. దేవుడి దయ ఉంటే విజయమ్మ కూడా జగన్ కోసం వస్తారు అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version