ఎమ్మెల్సీ భూమి కబ్జా..ప్రహరీని కూల్చిన కాంగ్రెస్ నేతలు

-

కాంగ్రెస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ మధ్యకాలంలో ఓ బిల్డర్ తన తావుకు సీఎం రేవంత్ రెడ్డి కారణమని.. ఆయన తీసుకొచ్చిన హైడ్రా కారణంగా రియల్ ఎస్టేట్ పూర్తిగా డౌన్ అయ్యిందని.. ప్లాట్స్ కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆరోపిస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

దీనికి తోడు బిల్డర్ల వద్ద రేవంత్ సర్కార్ భారీగా కమీషన్ వసూలు చేస్తున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఖాళీ స్థలం కనిపిస్తే చాలు. బడానేతల అండతో కాంగ్రెస్ కార్యకర్తలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. తాజాగా మాదాపూర్‌లో ఎమ్మెల్సీ నవీన్ రావుకి చెందిన భూమిలోని ప్రహారీ గోడలను కూల్చివేసి కాంగ్రెస్ నేతలు కబ్జా చేశారని ఆయన ఆరోపించారు.పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తంచేశారు.

https://twitter.com/TeluguScribe/status/1899335072672567732

 

Read more RELATED
Recommended to you

Latest news