ఈ నెల 21 నుంచి కాంగ్రెస్ “రైతు రచ్చబండ” కార్యక్రమం

-

ఈ నెల 21 వ తేదీ నుంచి రైతు రచ్చ బండ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. సోమవారం కాంగ్రెస్‌ పార్టీవిస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…రాజీవ్‌ గాంధీ వర్ధంతి సందర్భంగా మే 21 వ తేదీ నుంచి రైతు రచ్చ బండ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రారంభం కానున్న పాద‌యాత్ర‌ను తెలంగాణ నుంచి ప్రారంభించాల‌ని పార్టీ అధిష్ఠానాన్ని కోర‌నున్న‌ట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. సెంటిమెంట్‌గా యాత్ర‌ను తెలంగాణ‌లో ప్రారంభిస్తే బాగుంటుంద‌న్న విష‌యాన్ని పార్టీ పెద్ద‌ల‌కు చెబుతామ‌ని తెలిపారు. రైతు సంఘర్ష‌ణ స‌భ పేరిట వ‌రంగ‌లో నిర్వ‌హించిన రాహుల్ స‌భ విజ‌య‌వంత‌ మైంద‌న్న రేవంత్ రెడ్డి… ఆ స‌భ‌లో ప్ర‌క‌టించిన వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్‌కు పార్టీ పెద్ద‌ల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింద‌న్నారు. డిజిట‌ల్ మెంబ‌ర్ షిప్ డ్రైవ్ కూడా తెలంగాణ‌లో అంచ‌నాల‌కు మించి విజ‌యవంతం చేశామ‌ని అన్నారు రేవంత్.

Read more RELATED
Recommended to you

Exit mobile version