కాంగ్రెస్ పాలనలో…విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ పాలనలో ఈ పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. కానీ..కాంగ్రెస్ పాలనలో…విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విత్తన షాపుల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. డిమాండ్ ఉన్నరకం పత్తి విత్తనాల కోసం అన్నదాతలు బారులు తీరారు.
విత్తన షాపులు తెరవక ముందే నుంచే విత్తన ప్యాకెట్ల కోసం క్యూలైన్లు కట్టి నిరీక్షిస్తున్నారు రైతులు. అటు ఉమ్మడి మెదక్ జిల్లాలో విత్తనాల కోసం రైతుల కష్టాలు అంతా ఇంతా కాదు. జీలుగు, జనుము, పత్తి విత్తనాల కోసం గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉంటున్నారు రైతులు. ఉదయం నుంచే ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ముందు చెప్పులు, పాస్ బుక్కులు లైన్ లో పెడుతున్నారు రైతులు. తూప్రాన్, పుల్కల్ లో పచ్చిరొట్ట విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. దుబ్బాకలో పత్తి విత్తనాల కోసం 250 మీటర్ల మేర రైతులు క్యూ లైన్ లో ఉంటున్నారు.