కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆదివారం రాజగోపాల్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసింది వాస్తవమేనని, కానీ రాజకీయాల గురించి చర్చకు రాలేదని వెల్లడించారు. కోమటిరెడ్డి గతంలో బిజెపికి అనుకూలంగా ప్రకటన చేసిన సంగతి కూడా తెలిసిందే. అలాగే నిన్నటి ప్రెస్ మీట్ లో పిసిసి చీఫ్ జైలుకు వెళ్లొచ్చాడని అన్న వ్యాఖ్యలు, పార్టీ మారడం చారిత్రక అవసరమని ప్రకటించారు.
దీంతో రాజగోపాల్ రెడ్డి తీరుపై హై కమాండ్ కు ఫిర్యాదులు వెళ్లినట్లు, త్వరలోనే సోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీ మారాల్సి వస్తే భువనగిరి, మునుగోడు ప్రజలకు చెప్పే నిర్ణయం తీసుకుంటానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. రాజీనామా చేయాలని తాను అనుకోవడం లేదని.. గతంలో కాంగ్రెస్ అధిష్టానం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల బిజెపి బలపడే అవకాశం ఉందని చెప్పానని వెల్లడించారు.