ఎన్ఎస్ యూఐ నేతల ములాఖత్ కు అనుమతి… నేతలను కలవనున్న రాహుల్, రేవంత్ రెడ్డి

-

చంచల్ గూడ జైల్ లో ఎన్ ఎస్ యూ ఐ నేతలు, అధ్యక్షుడు వెంకట్ ను కలవడానికి కాంగ్రెస్ పార్టీకి అనుమతి లభించింది. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలతో పాటు బట్టి విక్రమార్కకు మాత్రమే అధికారులు అనుమతి ఇచ్చారు. నిన్న నేతల ములాఖత్ కు జైల్ సూపరింటెండెంట్ అనుమతి నిరాకరించారని వార్తలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒత్తడి రావడంతో అధికారులు నేతలను కలవడానికి అనుమతి ఇచ్చారు.

కాంగ్రెస్ నాయకులు మరోసారి ములాఖత్ కోసం దరఖాస్తు చేయడంతో అధికారులు అనుమతి ఇచ్చారు.  రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్కకు కూడా అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ జైళ్ల అధికారులను కోరగా… వీరికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు చంచల్ గూడ జైలులో ఉన్న 18 మంది ఎన్ ఎస్ యూ ఐ నేతలతో ములాఖత్ ఉండనుంది. ఇటీవల ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ ఎస్ యూ ఐ ఆందోళన నిర్వహించింది. ఈక్రమంలో పోలీసులు వారిని అరెస్ట్ చేసి చంచల్ గూడ జైల్ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version