ఓ వైపు క్రిస్ట్మస్ సెలవులతో పాటు న్యూ ఇయర్ సెలవులు రావడంతో తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. వరుస సెలవులను భక్తులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎప్పటినుంచో వీలుకానీ పెండింగ్ మొక్కులను ఈ సెలవుల్లో పూర్తి చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆలయాల్లో భక్తుల కోలాహలం నెలకొన్నది.
ఈ క్రమంలోనే నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ విపరీతరంగా ఉన్నది.శుక్లపక్షం విదియ బుధవారం సందర్బంగా అలాగే ఆంగ్ల నూతన సంవత్సరం పాఠశాలకు సెలవు దినం కలసి రావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో అక్షరాభ్యాస మండపాలు చిన్నారులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.