కొత్త పార్లమెంట్ కు అంబేద్కర్ పేరును పరిశీలించండి – బండి సంజయ్

-

న్యూఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు సెంట్రల్ విస్టా కు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని అంశాన్ని పరిశీలించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్రాన్ని కోరారు. నూతన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టానని ప్రజా గాయకుడు గద్దర్ ఇచ్చిన వినతి పత్రాన్ని ఆయన కేంద్రానికి పంపారు. కాగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా సెంట్రల్ ఇష్టాకు అంబేద్కర్ పేరు పెట్టాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.

కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని మంత్రి కేటీఆర్ తీర్మానం చేయగా.. కాంగ్రెస్ సభాపక్ష నేత భట్టి విక్రమార్క, మంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదం తెలపడానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version