హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో గల కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని సీఎం రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని..బీజేపీ శాసనసభ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.
మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకోవడానికి, సోనియా గాంధీ దగ్గర మెప్పు పొందడానికి రూ.40 వేల కోట్ల భూమిని కేవలం రూ.20 వేల కోట్లకే రాబర్ట్ వాద్రా బినామీకి అమ్ముతున్నాడని ఏలేటి సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.