విధి నిర్వహణలో ఉన్న హోంగార్డుపై మద్యం మత్తులో ఉన్న ఓ కానిస్టేబుల్ విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏపీలోని పల్నాడు -మాచర్లలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నైట్ బీట్ నిర్వహిస్తున్న హోంగార్డు శ్రీనివాస్ వద్దకు కానిస్టేబుల్ మల్లిఖార్జున పీకలదాకా మద్యం తాగి వచ్చి అకారణంగా అతనిపై దాడికి పాల్పడినట్లు సమాచారం.
బాధిత హోంగార్డు వద్దని వారిస్తున్నా వినకుండా కానిస్టేబుల్ మల్లిఖార్జున కర్రతో అతని మీద దాడి చేశాడు.దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన స్థానిక పట్టణ సీఐ పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
మద్యం మత్తులో హోంగార్డును కర్రతో బాదిన కానిస్టేబుల్
👉విధి నిర్వహణలో ఉన్న హోంగార్డుపై మద్యం మత్తులో కానిస్టేబుల్ విచక్షణారహితంగా దాడి
👉పల్నాడు – మాచర్లలో నైట్ బీట్ నిర్వహిస్తున్న హోంగార్డు శ్రీనివాస్ వద్దకు కానిస్టేబుల్ మల్లిఖార్జున పీకలదాకా మద్యం తాగి వచ్చాడు.
👉అనంతరం… pic.twitter.com/RDB3NIKgkf— ChotaNews (@ChotaNewsTelugu) December 28, 2024