ఎండ వేడిని తట్టుకోలేకపోతున్నారా? వీటిని తీసుకోండి..!

-

ఏం ఎండరా బాబు.. బయట కాలు పెట్టాలంటేనే భయమేస్తోంది. మధ్యహ్నం పూట అయితే నిప్పుల కొలిమే. వామ్మో.. ఈ ఎండల్లో ఒక్క రోజు తిరిగినా ఇంకేముండదు. మంచం మీద పడటమే. ఈ ఎండ వేడిని ఎలా తట్టుకోవాలి. ఇంట్లో ఉక్కపోత భరించలేకపోతున్నాం. బయటికెళ్తే ఎండ వేడి భరించలేకపోతున్నాం.. అని బాధ పడుతున్నారా? అస్సలు టెన్షన్ పడకండి. ఎందుకంటే.. ఎండాకాలంలో ఎండ సహజం. ఆ ఎండ వేడి నుంచి మనల్ని మనం రక్షించుకుంటే చాలు.

మజ్జిగ

అవును.. ఎండాకాలం ప్రారంభమయిందంటే చాలు. మజ్జిగ రోజూ మీ ఆహారంలో భాగం అయిపోవాలి. ఇది మీ శరీరంలోని వేడిని తగ్గించి.. మీ శరీరాన్ని చల్లబరుస్తుంది. దీంతో మీరు కూడా ఎండ నుంచి కాస్త ఉపశమనం పొందొచ్చు.

కొబ్బరి నీళ్లు

ప్రకృతి మనకు ఇచ్చిన గొప్ప ప్రసాదం కొబ్బరి నీళ్లు. సహజ సిద్ధంగా ఏర్పడే కొబ్బరి నీళ్లలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. దాంతో పాటు కొబ్బరి నీళ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి. కొబ్బరి నీళ్లలో ఉండే చక్కెర, ఎలక్ట్రోలైట్స్, ఖనిజ లవణాలు శరీరానికి ఉత్తేజాన్ని కూడా ఇస్తాయి.

పుచ్చకాయ

వేసవిలో విరివిగా లభించే పుచ్చకాయను ఎంత ఎక్కవ తింటే అంత మంచిది. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు, పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

కీరదోస

వేసవిలో దొరికే కీరదోసల్లో ఉండే ఫైబర్, నీరు.. డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తాయి.

పూదీన

పూదీనకు శరీరంలో ఉండే వేడిని తీసేసే గుణం ఉంది. అందుకే వేసవిలో పూదీనను ఎక్కువగా వాడాలి. ఎండాకాలంలో బయట పూదీన జ్యూస్ కూడా దొరుకుతుంది. దాన్ని తాగినా కూడా బెటరే. అది కొత్త శక్తిని ఇస్తుంది.

ఉల్లిగడ్డ

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిగడ్డ అంత చలువ. ఉల్లిగడ్డ శరీరాన్ని చల్లబరుస్తుంది. అందుకే కూరల్లో, చట్నీల్లో, సలాడ్స్ లో ఉల్లిపాయలను ఎక్కువగా వాడాలి. ముఖ్యంగా ఎండదెబ్బ తగలకుండా ఉండాలంటే ఉల్లిపాయలను ఎక్కువగా తీసుకోవాల్సిందే.

ఖర్భూజ పండు

ఖర్భూజ పండు.. దీంట్లో ఎక్కువ శాతం నీరే. కానీ.. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురికాదు.

నిమ్మరసం

వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి నిమ్మరసం దివ్యౌషధం. వేసవిలో ఎక్కువగా నిమ్మరసంతో చేసిన షర్బత్ తాగితే చాలా బెటర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version