పాపం! బీజేపీ హయాంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలు అన్నీ టీఆర్ఎస్ సేకరించింది. కానీ వాటిని ఏపీ కాంగ్రెస్ తెలివిగా తమకు అనుగుణంగా వాడుకుంది. కాపీ పేస్ట్ కాంగ్రెస్ అని అంటే ఇదేనేమో ! మోడీ మాత్రం యథాలాపంగా ఈ వివరాలు అన్నీ విన్నాక నవ్వుకునే ఉంటారు. గడిచిన ఎనిమిదేళ్లలో ఎనభై లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత ఆయననేదని ఏపీ కాంగ్రెస్ కూడా అదే వివరంను అనగా తెలంగాణ రాష్ట్ర సమితి సేకరించిన అప్పుల డేటాను ప్రమోట్ చేస్తూ తెలుగు వాకిట హిందీ మోడీని తమకు తెలియకుండానే బాగానే ప్రచారం చేస్తుంది. ఇంతకూ అప్పుల గోలేంటి? అందులో బీజేపీ సాధించిందేంటి?
అప్పులు ఎవరు చేసినా ఒప్పుకోకూడదు. కానీ కాంగ్రెస్ మాత్రం 67 ఏళ్లలో తమ ఏలుబడిలో 55,87,149 కోట్ల రూపాయల మేరకు అప్పలు చేశామని, కానీ ఎనిమిదేళ్లలోనే 80 లక్షల కోట్ల అప్పు మోడీ చేశారని మండిపడుతూ ఉంది కాంగ్రెస్. వీటిలో ఎక్కువ విదేశీ రుణాలే ఉన్నాయని, ఇదెంత మాత్రం దేశానికి మంచిది కానేకాదని అంటున్నారు. ఈ ఏడాదిలో దేశం అప్పులు 152, 17,190 కోట్లు అని లెక్క తేల్చింది. ఏటా పది లక్షల కోట్ల రుణం కేంద్రం తీసుకుంటున్నదని చెప్పారు.
ఇదే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు తావిస్తోంది. అయితే అప్పుల వివరాలు ముందు కేసీఆర్ బయటపెట్టాక తరువాత బీజేపీపై నిరసన స్వరం వినిపించింది ఏపీ కాంగ్రెస్. ఆ విధంగా కాంగ్రెస్ కొన్ని వివరాలు టీఆర్ఎస్ డేటా నుంచి ఎత్తుకొచ్చింది. ఆ విధంగా కాపీ పేస్ట్ కాంగ్రెస్ గా పేరు తెచ్చుకుంటోందని కొందరు విపక్ష సభ్యులు ఆరోపణలు చేస్తూ వ్యంగ్య రీతిలో జోకులు వేస్తున్నారు.