ఏపీలో శాంతించిన క‌రోనా.. నేడు 12,561 కేసులు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ లో క‌రోనా ఉధృతి కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింది. గ‌త రెండు రోజుల నుంచి చూస్తే.. నేడు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గింది. గ‌తంలో ప్ర‌తి రోజు 13 వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోదు అవుతుండేవి. కానీ నేడు దాదాపు 1000 కేసుల వ‌ర‌కు త‌గ్గాయి. కాగ తాజా గా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేసిన క‌రోనా బులిటెన్ ప్ర‌కారం గ‌డిచిన 24 గంట‌ల‌లో 12,561 క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.

అయితే ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య మాత్రం త‌గ్గ‌డం లేదు. ఈ రోజు కూడా భారీ సంఖ్య‌లో 12 మంది కరోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల మృతి చెందారు. కాగ రాష్ట్రంలో రీక‌వ‌రీ రేటు భారీగా ఉంది. గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా 8,742 మంది బాధితులు క‌రోనా వైర‌స్ ను జ‌యించారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,13,300 గా ఉంది. కాగ క‌రోనా కేసులు సంఖ్య త‌గ్గినా.. క‌రోనా వైర‌స్ తో పాటు ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి త‌గ్గ‌లేద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్ర‌జ‌లు అంద‌రూ క‌రోనా నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాల‌ని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version