కరోనా వైరస్ ప్రభావం ఇంతకు ముందు భారత్‌పై అంతగా లేకపోయినప్పటికీ ప్రస్తుతం ఈ వైరస్ మన దేశంలోనూ వేగంగా విస్తరిస్తోంది. భారత్‌లో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 107కు చేరుకుంది. అందులో విదేశీయులు కూడా ఉన్నారు. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇప్పటికే అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నాయి. కాగా ఢిల్లీ, కర్ణాటకలలో ఇప్పటికే కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు.
మన దేశంలో నమోదైన కరోనా కేసుల్లో మహారాష్ట్రలోనివే అధికంగా ఉండడం విశేషం. అక్కడ 31 మందికి కరోనా సోకింది. ఆ తరువాత కేరళ రెండో స్థానంలో ఉంది. అక్కడ 22 మంది కరోనా బారిన పడ్డారు. ఇక ఉత్తర ప్రదేశ్‌లో 11 మందికి కరోనా ఉన్నట్లు నిర్దారించారు. మరో 17 మంది విదేశీలకు కరోనా ఉండగా, 9 మంది ఇప్పటికే కరోనా నుంచి బయట పడి హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు.
కాగా ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం సార్క్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఆయా దేశాల నేతలతో కలిసి ఆయన కరోనాను అరికట్టేందుకు మూకుమ్మడి కార్యాచరణ ప్రకటించనున్నారు.