హైదరాబాద్ లో ఓమిక్రాన్ కలకలం… బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు ఓమిక్రాన్ లక్షణాలు..

-

ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది. ఎట్ రిస్క్ ఎక్కువగా ఉన్నదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఎక్కవగా నిఘా ఉంచారు అధికారులు. రిస్క్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చిన వారికి తప్పని సరిగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. ఈనేపధ్యంలోనే బ్రిటన్ నుంచి హైదరాబాద్ వచ్చిన మహిళకు ఓమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. సదరు మహిళ శాంపిళ్లను జీనోమ్ సిక్వెన్సింగ్ కోసం ల్యాబ్ కు పంపిచినట్లు వెల్లడించారు. విదేశాల నుంచి హైదరాబాద్కు 325 మంది రాగా.. అందులో మహిళకు పాజిటివ్ గా వచ్చిందని.. ఆమెను గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. నెగిటివ్ వచ్చిన వారికి వారం రోజుల తరువాత మరోసారి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో 72 మంది ఏపీకి చెందిన వారు కాగా.. 239 తెలంగాణకు చెందిన వారిగా శ్రీనివాస్ రావు తెలిపారు.

తెలంగాణలో గత నాలుగు రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. డిసెంబర్ చివరి నాటికి తెలంగాణలో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించిందని… అందుకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నామని శ్రీనివాస్ రావు తెలపారు. రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం మందికి మొదటి డోస్ పూర్తి అయిందని పేర్కొన్నారు. 47 శాతం మంది రెండో డోస్ తీసుకున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version