మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులు.. థర్డ్ వేవ్ కి సంకేతం అనుకోవచ్చా?

-

డెల్టా ప్లస్ వేరియంట్ కరోనా రూపాంతరం గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో మహారాష్ట్రలో ఎక్కువవుతున్న కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. జూన్ 16వ తేదీ మహారాష్ట్రలో కేసుల సంఖ్య 10,107గా ఉండింది. ఆ తర్వాత కేసులు తగ్గుతూ వచ్చాయి. కానీ గత రెండు రోజుల నుండి కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తుంది. బుధవారం రోజు 10,066 కేసులు నమోదయ్యాయి. అలాగే గురువారం 9844కేసులు వచ్చాయి. ఈ లెక్కలు చూస్తుంటే కరోనా మూడవ వేవ్ కి ఇది ముందస్తు హెచ్చరిక కావచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి.

సోమ, మంగళ వారాల్లో కేసుల సంఖ్య 6270, 8470గా ఉండింది. వరుస పెట్టి పెరుగుదల కనిపిస్తుంది.  అదీగాక మొదటి వేవే, సెకండ్ వేవ్ లో కరోనా ఎక్కువ కేసులు నమోదు అయ్యింది మహారాష్ట్రలోనే. కావున, డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభిస్తుందేమో అన్న ఆందోళనలు ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version