తెలంగాణలో కరోనా కల్లోలం… గడిచిన 24 గంటల్లో 4393 కరోనా కేసులు

-

తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజు రోజుకు కరోన కేసులు పెరగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వెయ్యికి దిగువనే ఉన్న కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సంక్రాంతి పండగ తర్వాత నుంచి కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 4393 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 24 గంటల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అయితే నిన్నటితో పోలిస్తే స్వల్పంగా కేసులు సంఖ్య తగ్గింది. నిన్న ఒక్క రోజే 4416 కేసులు వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 31,199 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గతంలో నెల క్రితం రాష్ట్రంలో కేసుల సంఖ్య వెయ్యికి దిగువనే ఉండేది… కానీ ప్రస్తుతం కేసుల సంఖ్య 4 వేలను దాటుతోంది. ఇదిలా ఉంటే ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కరోనా వ్యాప్తి నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇదివరకు వైద్యారోగ్య శాఖ ను ఆదేశించారు. మరోవైపు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో రాష్ట్రంలో ఫీవర్ సర్వే కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version