కరోనాతో అగ్రరాజ్యం అమెరికా అల్లాడుతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో అమెరికాలో కల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ దేశంలో కరోనా మరణాలు 8 లక్షలకు చేరాయి. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత 3 లక్షల మరణాలు చోటుచేసుకోవడం గమనార్హం. ప్రపంచంలో నమోదయిన 53 లక్షల మరణాల్లో 15 శాతం మరణాలు ఒక్క అమెరికాలోనే నమోదయ్యాయి. అనధికార లెక్కలను మరణాల లెక్కలను కలుపుకుంటే… అమెరికాలో 2020, మార్చి 1 నుంచి 8,80,000 మరణాలు నమోదయ్యాయని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం ఓ నివేదికలో తెలిపింది. కరోనా మరణాల సంఖ్య ఇలా ఉంటే ప్రస్తుతం ఓమిక్రాన్ అమెరికాలో వ్యాపిస్తోంది. దీంతో మరెన్ని విపత్కర పరిస్థితులు వస్తాయో అని అక్కడ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమెరికా తరువాత మరణాల్లో రెండో స్థానంలో బ్రెజిల్ ఉంది. ఈదేశంలో కరోనా మూలంగా 6 లక్షల మంది మరణించారు. సెకండ్ వేవ్ లో బ్రెజిల్ దేశంలో కరోనా మరణాలు ఎక్కవగా సంభవించాయి. ప్రతిరోజు లక్షల్లో కేసులు వెలుగుచూశాయి. ఆసుపత్రులు సరిపోక మృతుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం టీకా పంపిణీ వేగవంతం చేసినందున కొంత మేర అదుపులోకి వచ్చింది. ఇండియాలో 4 లక్షల మరనాలు సంభవించాయి.