కరోనా విలయతాండవం ధాటికి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 40లక్షల మంది బలయ్యారని రాయిటర్స్ సంస్థ ప్రచురించింది. కొత్త కొత్త వేరియంట్లు వేగంగా వ్యాప్తి చెంది మరణాలకి కారణమవుతున్నాయని పేర్కొంది. ఈ వేరియంట్ల ప్రతాపం ఎంత మాదిరిగా ఉందో లెక్కలు వివరించిన రాయిటర్స్, కరోనా వచ్చిన సంవత్సరంలో 20లక్షల మరణాలు సంభవిస్తే, కేవలం 166రోజుల్లేనే మరో 20లక్షల మరణాలు నమోదయ్యాయి. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలలో మరణాల సంఖ్య తగ్గింది.
కాకపోతే పేద దేశాలకి టీకా అందుబాటులో లేకపోవడం వల్ల కేసులు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కరోనా కారణంగా ప్రాణాలు పోయిన వారిలో అమెరికా, బ్రెజిల్, ఇండియా, రష్యా ఇంకా మెక్సికో మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 50శాతం మరణాలు ఈ ఐదు దేశాల్లోనే జరిగాయి. జనాభా పరంగా చూస్తే, పెరూ, హంగరీ, బోస్నియా, చెక్ రిపబ్లిక్, జిబ్రాల్టర్ వంటి దేశాల్లో ఎక్కువ మరణాలు నమోదయ్యాయి.