7th Pay Commission: ట్రావెల్ అలవెన్స్ క్లెయిమ్స్ సబ్మిట్ చేయడానికి గడువు పెంపు..!

-

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుకి మరో శుభవార్త. రిటైర్మెంట్ సమయంలో ట్రావెల్ అలవెన్సు కి సంబంధించి క్లెయిమ్స్ సబ్మిట్ చేయడానికి ప్రస్తుతం ఉన్న 60 రోజుల గడువును ఏకంగా 180 రోజులకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం.

అయితే క్లెయిమ్ సబ్మిట్ చేయడంలో రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని దృష్టి లో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. రిటైర్మెంట్ తర్వాత సొంతూరికి వెళ్లే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అందుకు సంబంధించిన ట్రావెల్ అలవెన్సుల క్లెయిమ్స్‌ను ఇక పై 180 రోజుల్లో సబ్మిట్ చేయొచ్చు.

2021 జూన్ 15న ఈ ఆర్డర్ అమలు లోకి రావడం జరిగింది.దీనితో ఉద్యోగులకి కాస్త రిలీఫ్ గా కూడా ఉంటుంది. శిక్షణ, బదిలీ, టూర్లకు సంబంధించిన ట్రావెల్ అలవెన్స్ క్లెయిమ్స్‌ను సబ్మిట్ చేయడానికి 60 రోజుల గడువు ఉన్నట్టు తెలుస్తోంది.

దీనిలో ఏ విధమైన మార్పు చెయ్యలేదు. కేవలం రిటైర్ట్ ఉద్యోగులు సొంతూళ్లకు వెళ్లడానికి సంబంధించిన ట్రావెల్ అలవెన్సులు 180 రోజుల్లో సబ్మిట్ చేయొచ్చు అని అన్నారు.

ఇది ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం మహమ్మారి కారణంగా నిలిపివేసిన డీఏ, డీఆర్‌ను రీస్టోర్ చేయాలని నిర్ణయించింది. దీనిలో మొత్తం 11 శాతం డీఏ పెరగనుంది. ప్రస్తుతం ఉన్న డీఏ 17 శాతం, 11 శాతం కలిపి మొత్తం 28 శాతం డీఏ వస్తుంది. వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్ పెరుగుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version