నాగార్జునకు కరోనా ఎఫెక్ట్…!

-

మన్మధుడు నాగార్జున హీరోగా అహిషోర్ సోలోమన్ దర్శకత్వ్ంలో నటిస్తున్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఈ సినిమాలో నాగ్, ఉగ్రవాద నిరోధక ఎన్‌ఐఏ అధికారి విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లుక్ ఇప్పటికే విడుదలై మంచి ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగ్ సరసన సయామీ ఖేర్, దియా మీర్జా నటిస్తున్నట్టు టాక్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ని ప్రస్తుతం హైదరాబాద్ లో పూర్తి చేసి విదేశాల్లో ప్లాన్ చేసాడు దర్శకుడు. థాయ్‌లాండ్‌లో ఈ సినిమా షూటింగ్ ప్లాన్ చేసారు. అయితే ఇప్పుడు షూటింగ్ ని వాయిదా వేసే అవకాశం ఉందని అంటున్నారు. దానికి కారణం ఏంటీ అంటే కరోనా… కరోనా వైరస్ ప్రభావం ఉన్న దేశాల్లో థాయ్‌లాండ్ కూడా ఉంది. ఆ దేశంలో కూడా కొన్ని కేసులు నమోదు అవుతున్న నేపధ్యంలో విదేశీయులను రానీయడం లేదు.

అక్కడ కరోనా క్రమంగా విస్తరిస్తూ ఉంది. దీనితో చిత్ర యూనిట్ థాయ్‌లాండ్ షెడ్యూల్‌ను వాయిదా వేసినట్టు తెలుస్తుంది. మిగిలిన షూటింగ్ ని పూర్తి చేసి తర్వాత అక్కడ చూడాలని… అప్పటికి షూటింగ్ చేయడం కుదరకపోతే అక్కడ కాకుండా మరో దేశంలో చెయ్యాలని భావిస్తున్నారు. ఇక కరోనా ఇప్పటికే చైనాలో 25 వేల మందికి సోకిన సంగతి తెలిసిందే. దీనితో చైనా ఎం చెయ్యాలో అర్ధం కాక ఆందోళన చెందుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version