కరోనా ఇప్పుడప్పుడే పూర్తిగా అంతమవ్వదని, 2021లోనూ కొన్ని నెలల పాటు కరోనా ప్రభావం ఉంటుందని, తరువాత ఆ వైరస్ ప్రభావం తగ్గుతుందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. ఈ మేరకు ఆయన ఓ మీడియా సంస్థకు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. కరోనా కేసులు ప్రస్తుతం భారీగా నమోదవుతున్నాయని, అయితే ఇదే పరిస్థితి కొంత కాలం వరకు ఉంటుందని, తరువాత కేసుల సంఖ్య తగ్గుతుందని అన్నారు.
ప్రస్తుతం దేశంలో చిన్నపాటి నగరాలు, పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ కరోనా ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. అలాగే టెస్టింగ్ కెపాసిటీ రోజు రోజుకీ పెరుగుతుందని, అందువల్లే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుందని అన్నారు. అయితే ఈ ఏడాది చివరి వరకు మన దేశంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక కరోనా ఒకసారి వచ్చాక మళ్లీ వస్తుందనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవన్నారు. కరోనా రీ ఇన్ఫెక్షన్‌పై మరిన్ని పరిశోధనలు జరగాలన్నారు. కనీసం 9 నుంచి 12 నెలల పాటు ఆగితే కరోనా రీ ఇన్ఫెక్షన్‌పై స్పష్టత వస్తుందన్నారు.