కరోనా మార్గదర్శకాలు మళ్లీ పొడిగింపు.. కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు

-

ఢిల్లీ : కోవిడ్ మార్గదర్శకాల అమలుపై రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగించిన కోవిడ్ మార్గదర్శకాలు అమయ్యేలా చూడాలని.. రాష్ట్రాల్లో కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని జిల్లాల్లో యాక్టీవ్ కేసుల పెరుగుదల, అత్యధిక పాజిటివిటీ రేటు ఆందోళనకరంగా ఉందని లేఖలో పేర్కొన్నారు.

హై-పాజిటివిటీ రేటు ఉన్న చోట వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలని.. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాల ప్రకారం చర్యలు చేపట్టాలని కోరారు. పండుగల సీజన్లో జనం సమూహాలుగా ఏర్పడకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. రద్దీ ప్రాంతాల్లో కోవిడ్-19 నిబంధనలు కఠినంగా అమలు చేయాలని.. ఐదంచెల కోవిడ్-19 వ్యూహాన్ని (టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్-కోవిడ్ ప్రవర్తనా నియమావళి) అమలు చేయాలని పిలుపునిచ్చారు. కోవిడ్-19 ప్రవర్తనా నియమావళి అమలయ్యేలా స్థానిక ప్రభుత్వ యంత్రాంగాలు కఠినంగా వ్యవహరించాలన్నారు. మాస్కులు ధరించని వారికి ,సామాజిక దూరం పాటించని వారిపై తీసుకునే క్రమశిక్షణా చర్యలు, జరిమానాలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు.

కరోనా కట్టడికి రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు తమ ప్రయత్నాలు పెంచాలని.. వ్యాక్సినేషన్‌లో దేశవ్యాప్తంగా చాలా పురోగతి ఉందని తెలిపారు. అర్హులైన అందరికీ వ్యాక్సిన్ అందేలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు టీకా కార్యక్రమాన్ని కొనసాగించాలని.. టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవడం, సర్వైలెన్స్ పై దృష్టి పెట్టాలన్నారు. కోవిడ్ నిభందనలు పాటించకుండా నిర్లక్ష్యం వహించేవారిపై కఠిన చర్యలు చేపట్టాలని.. కోవిడ్ కట్టడికి కోసం జిల్లా అధికారులకు కఠినమైన ఆదేశాలు జారిచేయాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులని కోరారు అజయ్ భల్లా. కోవిడ్ నిబంధనలు అమలు చెయడంలో అధికారులు అలసత్వం వహిస్తే సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని.. క్షేత్ర స్థాయిలో కోవిడ్ నిబంధనలు పాటించడం పై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version