ఇండియాలో కోవిడ్ మహమ్మారి దాదాపుగా తగ్గింది. ఇండియా వ్యాప్తంగా కొన్ని రోజులుగా కేసుల సంఖ్య తగ్గతూ వస్తున్నాయి. కేవలం వెయ్యి లోపే కేసులు నమోదు అవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా దాదాపుగా తగ్గింది. ఓ వైపు మన పొరుగు దేశం చైనాలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నా… మనదేశం మాత్రం కరోనా కట్టడిలో సఫలం అయింది. ఇండియాలో ఇప్పటి వరకు 180 కోట్లకుపైగా వ్యాక్సినేషన్ డోసులు అందించారు.
ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో ఇండియా వ్యాప్తంగా కేవలం 975 కరోనా కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. 796 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. 24 గంటల్లో కేవలం నలుగురు మాత్రమే మరణించారు. ప్రస్తుతం ఇండియాలో 11366 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కోవిడ్ గణాంకాలను పరిశీలిస్తే ఇండియాలో మొత్తం వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,25,07,234 గా ఉంది. దేశంలో మొత్తం రికవరీల శాతం 98.76 గా ఉంది. ఇప్పటి వరకు కోవిడ్ బారి పడి 5,21,747 మంది మరణించారు. మరణాల శాతం 1.21గా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 186,38,31,723 డోసుల వ్యాక్సినేషన్ అందించారు.