చైనా వూహాన్ నగరంలో మొదలైన కరోనా వైరస్ రెండేళ్ల నుంచి ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ఇప్పటికే అనే రూపాలు మార్చుకుంటూ… ప్రజలపై దాడి చేస్తోంది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్ల రూపంలో ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పుడు ఓమిక్రాన్ ఉపవేరియంట్ బీ.ఏ.2 ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే 50కి పైగా దేశాల్లో ఈ వేరియంట్ ను గుర్తించారు.
ఇదిలా ఉంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కరోనాపై కీలక ప్రకటన చేసింది. ఒక వేళ కొత్త వేరియంట్ కనుక పుట్టుకొస్తే… ఓమిక్రాన్ కంటే ప్రమాదకరంగా వ్యాపించే అవకాశం ఉందని WHO సాంకేతిక విభాగాధిపతి మరియా వాన్ కెర్ఖోవ్ అన్నారు. కొత్తగా పుట్టుకొచ్చే వేరియంట్ కు రోగనిరోధక శక్తిని ఏమార్చే గుణంగా అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చిరించింది. టీకాల ప్రభావం కూడా వాటిపై ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రపంచం ఇలాంటి స్థితికి చేరుకోకూడదని కోరుకుంటున్నామని కెర్ఖోవ్ అన్నారు.