సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం ములాయం సింగ్ యాదవ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. .ములాయం సింగ్ భార్య సాధనా గుప్తాకు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి..ఇద్దరినీ బుధవారం అర్థరాత్రి గురుగ్రామ్‌లోని వెదంత ఆసుపత్రిలో చేర్చారు..సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్ మెంట్ కొనసాగుతుందిని, ప్రస్తుతానికి ములాయం సింగ్‌కు కరోనా లక్షణాలు లేవు” అని సమాజ్ వాదీ పార్టీ ట్వీట్ చేసింది..ములాయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని, అందువల్ల అతన్ని మెదంత గురుగ్రామ్‌కు తీసుకెళ్లాల్సివచ్చిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి..
ములాయం ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ములాయంకు చికిత్సనందిస్తున్నట్లు అఖిలేష్ తెలిపారు. ములాయంకు ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు చెప్పారు. వైద్యులను సంప్రదిస్తూ ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నామని అఖిలేష్ యాదవ్ తెలిపారు.
అంతకు ముందు ఆగస్టులో ములాయం సింగ్‌కు మూత్ర నాళంలో ఇన్‌ఫెక్షన్ రావడంతో మెదంత ఆసుపత్రిలో చేరారు..సెప్టెంబర్ 23 న ముగిసిన పార్లమెంటు రుతుపవన సమావేశానికి ములాయం సింగ్ హాజరయ్యారు. సెప్టెంబర్ 14న జరిగిన మొదటి రోజున వీల్ చైర్ మీద పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యాడు..ములాయం సింగ్ మూడుసార్లు ఉత్తరప్రదేశ్ సిఎంగా పనిచేశారు (1989 నుండి 1991 వరకు, 1993 నుండి 1995 వరకు, మరియు 2003 నుండి 2007 వరకు). హెచ్‌డి దేవేగౌడ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు.