రాష్ట్రంలో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా వ్యాప్తి.. నేడు 2,047 కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మ‌ళ్లీ పెరిగింది. శనివారం కాస్త త‌గ్గిన‌ట్టు అనిపించినా.. ఈ రోజు మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరిగాయి. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,047 క‌రోనా కేసులు వెలుగు చూశాయి. కాగ శ‌నివారం రాష్ట్రంలో 1,963 కేసులు న‌మోదు అయ్యాయి. అంటే నిన్న‌టితో పోలిస్తే.. రాష్ట్రంలో 84 క‌రోనా కేసులు పెరిగాయి. అయితే రాష్ట్రంలో మ‌ర‌ణాలు కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి.

గ‌త కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల మూడు మ‌ర‌ణాలు వెలుగు చూశాయి. కాగ నేటి క‌రోనా కేసుల‌తో ప్ర‌స్తుతం రాష్ట్రంలో 22,048 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగ దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కూడా క‌రోనా వ్యాప్తి పెరుగుతుంది. ముఖ్యంగా జీహెచ్ ఎంసీ ఏరియాలో కేసుల సంఖ్య తీవ్రంగా ఉంది. అయితే ప్ర‌స్తుతం సంక్రాంతి స‌మ‌యం కావ‌డంతో పల్లెల్లో కూడా కరోనా వ్యాప్తి పెరిగే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version