హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో దారుణం చోటు చేసుకుంది. సహ జీవనం చేస్తున్న యువకుడిపై యువతి కత్తితో దాడి చేసింది. ఈ ఘటన నగరంలోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని లంగర్ హౌస్ ప్రాంతంలో కృష్ణ అనే యువకుడు ఒక యువతితో సహ జీవనం చేస్తున్నాడు. అయితే ఈ రోజు కృష్ణ పై ఆ యువతి కత్తితో దాడి చేసింది. దీంతో కృష్ణ కు తీవ్ర గాయాలు అయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం తీవ్రం గా గాయపడ్డ కృష్ణను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అలాగే కత్తి దాడి చేసిన యువతి పై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే దర్యాప్తు చేస్తున్నారు. కాగ కృష్ణ, ఆ యువతి గత కొద్ది కాలం నుంచి సహ జీవనం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. కాగ సహ జీవనంలో ఉన్న కృష్ణ పై యువతి ఎందుకు దాడి చేసింది అనే విషయం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.