గుడ్ న్యూస్‌.. 60 శాతానికి చేరుకున్న క‌రోనా రిక‌వ‌రీ రేటు..

-

దేశ‌వ్యాప్తంగా క‌రోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్ర‌మేణా పెరుగుతోంది. శుక్ర‌వారం నాటికి కోవిడ్ 19 రిక‌వ‌రీ రేటు 60.73గా న‌మోదైంది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఏకంగా 20,033 మంది రిక‌వ‌రీ అయ్యారు. ఇక క‌రోనా యాక్టివ్ కేసుల క‌న్నా రిక‌వ‌రీ అయిన కేసుల సంఖ్య 1.5 ల‌క్ష‌ల‌కు పైగా పెరిగింది. ఈ మేర‌కు కేంద్ర కేబినెట్ సెక్ర‌ట‌రీ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించి వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,79,891 కు చేరుకోగా, 2,27,439 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ క్ర‌మంలో యాక్టివ్ కేసుల క‌న్నా కోలుకున్న కేసుల సంఖ్య 1,52,452 ఎక్కువ‌గా ఉంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు 93 ల‌క్ష‌ల వ‌ర‌కు శాంపిల్స్‌ను టెస్టు చేశారు. గ‌డిచిన 24 గంట‌ల్లోనే 2,41,576 శాంపిల్స్‌ను ప‌రీక్షించారు.

అయితే మ‌రికొద్ది రోజుల పాటు ఇదే ట్రెండ్ కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని వైద్య నిపుణులు అంటున్నారు. కేసుల సంఖ్య పెరుగుతున్నా.. రిక‌వ‌రీ రేటు కూడా పెరుగుతుండడం శుభ ప‌రిణామ‌మ‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version