చైనాలో మొదలైన కరోనా మహమ్మారి మళ్లీ మరోసారి తన ప్రతాపం చూపిస్తోంది. ఓమిక్రాన్ రూపంలో మళ్లీ ప్రపంచంపై దాడి చేస్తోంది. ఇప్పటికే ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇన్నాళ్లు కేవలం రోజు వారీ కేసుల సంఖ్య 10 లోపే ఉంటే.. తాజాగా ఇటీవల కేసుల సంఖ్య 15 వేలు, 20 వేలను దాటుతున్నాయి. ఇదిలా ఉంటే పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రెటీలకు కరోనా వైరస్ సోకుతుండటం అందర్నిని కలవరపెడుతోంది.
తాజాగా తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తక్కువ లక్షణాలు ఉన్నట్లు ఆయన తెలపారు. తనతో ఇటీవల సన్నిహితంగా మెలిగిన వారందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే తెలంగాణలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిలు కరోనా బారిన పడ్డారు. దీంతో పాటు టీఎంసీ లీడర్ ఎంపీ డెరిక్ ఓబ్రయిన్, ఎన్సీపీ నేత, ఎంపీ సుప్రియా సూలే వంటి రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు.
I have tested positive for covid with mild symptoms. Those who came in contact with me over the last few days, kindly take necessary precautions. #Covid_19
— Revanth Reddy (@revanth_anumula) January 3, 2022