కొన్ని కొన్ని సార్లు జరిగే విచిత్ర సంఘటనలు సిబ్బంది నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారిపోతూ ఉంటాయి. అస్వస్థతకు గురైన వ్యక్తిని ఆంబులెన్స్ లేకపోవడంతో చెత్త రిక్షాలో ఆస్పత్రికి తరలించారు సిబ్బంది. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం ఐ భీమవరం గ్రామంలో వెలుగులోకి వచ్చింది ఘటన . ప్రస్తుతం సిబ్బంది తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
విజయవాడకు చెందిన సతీష్ కుమార్ అనే వ్యక్తి… ఐ భీమవరం బస్టాండ్ లో గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే సదరు వ్యక్తిని పంచాయతీ అధికారులు గమనించారు. ఆరోగ్య సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఆరోగ్య అక్కడికి చేరుకొని అతని పరిస్థితి కాస్త విషమంగా ఉండడంతో ఆకువీడు లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో చెత్త రిక్షాలో అతన్ని ఆసుపత్రికి తరలించడం పై విమర్శలు వస్తున్నాయి. కాగా మద్యం ఎక్కువగా సేవించడం కారణంగా గ్యాస్ ఫామ్ అయింది అంటూ వైద్యులు నిర్ధారించారు. కరోనా పరీక్షలు చేస్తుండగా అతడు అక్కడి నుంచి పరారయ్యాడు,