ఏపీ జైళ్ళలో కరోనా కలకలం !

-

ఏపీలో కరోనా కేసులు ఏ రేంజ్ లో నమోదవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు కొత్తగా ఏపీ జైళ్ళలో కరోనా కలకలం రేపుతోంది. ఖైదీలకి జైలు సిబ్బందికి కరోనా ముప్పు పొంచి ఉంది. ఇప్పటిదాకా 1375 మంది ఖైదీలకి కరోనా సోకగా 241 మంది సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు. ఇక ఇప్పటి దాకా కోలుకున్న వారిలో 380 మంది ఖైదీలు ఉండగా 95 మంది జైలు సిబ్బంది ఉన్నారు. ఇక కరోనా బారిన పడి నలుగురు జైలు సిబ్బంది చనిపోగా ఒక ఖైదీ మృతి చెందారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా కడప జైల్లోనే కరోనా బారిన పడ్డాడు.

ఇక కరోన కారణంగా వివిధ ఆసుపత్రులతో చేరిన ఐదుగురు ఖైదీలు పరారయ్యారని చెబుతున్నారు. అయితే కరోనా దృష్ట్యా, కొత్త ఖైదీలను జైళ్ళ శాఖ అనుమతించ కూడదని అనుకున్నా, మద్యం అక్రమ రవాణా పెరుగుతుండంతో జైళ్ళలోకి కొత్త వారిని అనుమతించక తప్పడం లేదు. ఈ కొత్తగా వచ్చిన ఖైదీల కారణంగానే జైళ్ళకు కరోనా సోకినట్టు భావిస్తున్నారు. ఇక ఈ కరోనా కారణంగా వారం వారం జైళ్ళలో పరీక్షలు చేస్తోంది వైద్యారోగ్య శాఖ. అలా మొదటి నుండి ఇప్పటి దాకా 20 దఫాలు పరీక్షలు చేశారు. కరోనా సోకిన వారికి జైల్లో చికెన్, డ్రై ఫ్రూట్స్ వంటి పౌష్టికాహారం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version