భారత్ లో భారీగా కరోనా కేసులు.. మరోపక్క వ్యాక్సిన్ కొరత ?

-

భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ కోసం డిమాండ్ పెరిగినట్టు చెబుతున్నారు. వ్యాక్సిన్ కావాలని పలు రాష్ట్రాల నుంచి కేంద్రం పై ఒత్తిడి తెస్తున్నట్టు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వ్యాక్సిన్ కొరత మీద మహారాష్ట్ర, కేంద్రం మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఢిల్లీలోని నోయిడా, ఘజియాబాద్ లో వ్యాక్సిన్ స్పాట్ లు రద్దు చేసినట్లు సమాచారం. ఇక ఇండియాలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. 

రోజువారీ కేసుల సంఖ్య లక్షకు పైగా నమోదవుతున్నాయి.  తాజాగా ఇండియాలో 1,26,789 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,29,28,574కి చేరింది.  ఇందులో 1,18,51,393 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 9,10,319 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 685 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,66,862కి చేరింది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version