పోలీస్ శాఖను కరోనా కలవర పెడుతోంది. ఇప్పటిదాకా తెలంగాణ పోలీస్ శాఖలో మొత్తం 5,684 పోలీసు సిబ్బందికి కరోనా సోకింది. వీరిలో 2,284 మంది డిశ్చార్జ్ కాగా, 3,357 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 44 మంది పోలీసులు కరోనాకు బలయ్యారని తెలుస్తోంది. అమరలైన వారిలో కానిస్టేబుల్ నుండి అడిషనల్ ఎస్పీ ర్యాంక్ వరకు ఉన్నారు.
మొత్తం తెలంగాణా పోలీస్ డిపార్ట్ మెంట్ లో 54 వేల మంది సిబ్బంది ఉండగా వారిలో పది శాతం మందికి కరోన సోకింది. ఈ కరోనా కేసుల్లో హైదరాబాద్ కమిషనరేట్ టాప్ అని చెబుతున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,967 మంది కరోనా బారిన పడగా అందులో 891 చికిత్స పొందుతున్నారు. 1053 మంది రికవరీ కాగా 23 మంది చనిపోయారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ 526 కేసులు ఉండగా, 361 మంది చికిత్స పొందుతున్నారు, 163 మంది డిశ్చార్జి, ఇద్దరు మరణించారు.