కేసీఆర్ రేపు అసెంబ్లీకి రావాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

-

కేసీఆర్ రేపు అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటే కేసీఆర్ రేపు అసెంబ్లీకి వస్తారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీ కుల గణన విజయవంతంగా పూర్తి చేసి రేపు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో మంత్రి పొన్నం మాట్లాడారు. కుల గణనను ఒక ఉద్యమంలాగా చేశామని గుర్తు చేశారు.

Minister Ponnam Prabhakar invites KCR

ప్రధాన రాజకీయ పార్టీ పెద్దలు కుల గణనలో వివరాలు ఇవ్వలేదని ఆగ్రహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సహాయ నిరాకరణ లాగా కొందరు కావాలనే వివరాలు ఇవ్వలేదని తెలిపారు. కుల గణనపై అన్ని రాజకీయ పార్టీలు తమ స్టాండ్ ఏంటో తెలియజేయాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. బలహీన వర్గాల కోసం రేపు అసెంబ్లీలో అన్ని పార్టీలు తమ వాదన వినిపించాలని పేర్కొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ తరుణంలోనే… కేసీఆర్ రేపు అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్రానికి పెద్దగా కేసీఆర్‌ రావాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version